Infosys Company : ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ భారీ షాక్: నకిలీ గుర్తింపులపై కొరడా

Jun 09, 2026 - 17:46
0 0
Infosys Company : ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ భారీ షాక్: నకిలీ గుర్తింపులపై కొరడా

Infosys Company : భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న నకిలీ గుర్తింపులు, అవకతవకలపై తీవ్రంగా స్పందించింది. అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు కొన్ని కేసులను గుర్తించిన నేపథ్యంలో, ఏకంగా 20 వేల మందికి పైగా అభ్యర్థులకు సంబంధించిన ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లు , ప్రత్యక్ష మూల్యాంకనాలను కంపెనీ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (TOI) పత్రిక ఒక ప్రత్యేక కథనంలో నివేదించింది. కంపెనీలో ప్రతిష్టాత్మకమైన ‘స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ – ట్రైనీ’ , ‘డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ – ట్రైనీ’ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ఈ వాయిదా నిర్ణయం వర్తిస్తుందని ఐటీ వర్గాలు వెల్లడించాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User