Pawan Kalyan : ‘పొల్లు మాట’లతో చేటు తేవొద్దు!

Jun 09, 2026 - 17:52
0 1
Pawan Kalyan : ‘పొల్లు మాట’లతో చేటు తేవొద్దు!

ఇదేనా మన సభ్యత, సంస్కారం, సాంప్రదాయం? ఇదేనా మనకు మన విద్య ద్వారా లభించినవినయం, వివేకం, వికాసం? ఈ మధ్య హైదరాబాదులో చెలరేగుతున్న మాటల మాయాజాలం నన్నెంతో కలవరపరి చింది. ఇంకా కలవర పరుస్తూనే ఉంది. దేశ స్వాతంత్య్ర సమరంలో, హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ఆనాటి హైదరా బాదు వారు జరిపిన విలీన పోరాటం లో, అటు తదుపరి తెలంగాణ అస్తిత్వ పోరాటంలో చాలా చురుకుగా పనిచేసి కరవళ్లు మోసిన వాణ్ణి, కారాగారాల్లో బంధించబడినవాణ్ణి. నిజమైన, స్వచ్ఛమైన స్వాతంత్ర్య సమరయోధుణ్ణి. కనుకనే ఈనాటి అసభ్యకరమైన, ఆందో ళనకరమైన మాటల పోటీలను చూస్తుంటే, వింటుంటే తట్టుకోజాలడం లేదు. ఇదేనా మనం మన యువతకిస్తున్న సందేశం, వారసత్వం? ఇందుకొరకేనా మనం సకల త్యాగాలతో స్వాతంత్ర్యాన్ని సాధించింది? అని అనుకుంటూ శాంతి ప్రశాంతతలు కోల్పోతున్నాను. ఒక దేశం లేక రాష్ట్రంవారు ఇంకొక దేశానికి, రాష్ట్రానికి అనేకానేక కారణాల వల్ల రావటం పోవటం జరగడం అనాదిగా మామూలే కదా!
అది వ్యాపారం కొరకు కావచ్చు, విద్య కొరకు కావచ్చు. ఉపాధి కొరకు కావచ్చు, కాని నాకు తెలిసినంతవరకు అది రాజకీయాల కొరకు మాత్రం కాదు, కాకూడదు కూడా. కాని ఇప్పుడు మాత్రం తక్కినవాటికంటే రాజకీయ కారణాలే ఎక్కువేమోనని తెలంగాణావారు గాభరా పడుతున్నారు. అందుకేనేమో కొందరు అలజడులకు, అసభ్య పదజ లాలకు పాటుపడుతున్నారు. ఇది వారి విశ్వాసానికి చెందిన విషయం. దానికి గత చరిత్ర కారణం కదా! కాదనగలమా మరి!



ఒకప్పుడు తెలంగాణాను ఆంధ్రా ప్రాంతంలో విలీనం చేస్తున్నప్పుడు ‘జంటిల్మెన్ అగ్రిమెంట్ ద్వారా తెలంగాణా వారికి ఆంధ్రాప్రాంతపు నేతలు ఎన్నో వాగ్దానాలు చేశారు. వాటిని పట్టించుకోకపోవడం వలననే కదా ప్రత్యేక తెలం గాణా పోరాటం వచ్చింది. మరి ఇప్పుడుకూడా ఈనాటి ప్రభుత్వాలు అనేకానేక వాగ్దానాలు చేస్తూనే ఉన్నాయి. వాటిని అమలు చేయకుండా చేతులెత్తేస్తూనే ఉన్నాయి. వాటికి అనేకానేక కారణాలు ఉదహరిస్తూ. మరొకసారి తెలుగువారందరూ కలిస్తే రెండు రాష్ట్రాలు ఒకటైతే తెలం గాణా వారికి అదే గతి పడుతుందేమోననే అనుమానం రాకుండా ఉంటుందా? ఇంగ్లీషులో ఒక సామెత ‘వి హాడ్ ద ఎక్స్ పీరియన్స్ బట్ మిక్స్డ్ ద మీనింగ్’ యనునది ఉంది. ఇంకొకటి ‘హిస్టరీ టీచస్ అజ్ దట్ మ్యాన్ కైండ్హా ర్డలీ లర్న్స్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్టరీ’ యనునది. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న కలహాలను చూస్తుంటే ఔను కదా! అంతే కదా! అని అనిపిస్తుంది. మనకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. దానితో మనమేం నేర్చుకున్నాం. రెండవ ప్రపంచయుద్ధం వచ్చింది. మనమేం నేర్చుకున్నాం. ఇప్పుడు మూడో ప్రపంచయుద్ధం దాదాపు మొదలైంది. దానివలన మనమేం నేర్చుకుంటున్నాం? తెలంగాణ అస్తిత్వ పోరాటం వచ్చింది, దానితో మనం ఏం నేర్చుకున్నాం? ఇదీ అంతే కావచ్చునను భయాందోళన ఈనాటి తెలంగాణా వారి అలజడికి, అప్రస్తుత, అసభ్య పదజాల వాడుకకు కారణం కాదని నిస్సందేహంగా అనగలమా? పవన్ కళ్యాణ్ జనసేన యను ఒక పార్టీని స్థాపించారు. ఆ పార్టీని తెలంగాణాలో కూడా పెట్టదలచుకున్నారు. దానికి అభ్యంతరమెందుకు? ఆయన హైదరాబాదులో ఒక సభ జరపాలని అనుకున్నారు. దానికి అనుమతి నిరాకరణ ఎందుకు? ఆ పార్టీ కాక ఇంకా ఎన్నో పార్టీలు హైదరాబాదులో లేవా? ఇంకా వస్తూనే ఉన్నాయి కదా? ఆయా పార్టీలు వారివారి సభలు సమావే శాలు జరుపుకోవడం లేదా? అసలు కారణం అది కాదు. అసలు కారణం ఆనాటి అంధ్రాప్రాంతపు అధిపత్యం తిరిగి మరొకసారి తెలంగాణాకి వస్తుందేమోనని, ఇది తెలంగాణా వారి విశ్వాసానికి చెందింది. 

Politics

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User