5,255 మంది చిన్నారులకు తిరుమలలో పోలియో చుక్కలు
దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
టీటీడీ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎస్. కుసుమ కుమారి పర్యవేక్షణలో తిరుమలలో మొత్తం 25 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 21 కేంద్రాలు భక్తుల కోసం, మరో నాలుగు కేంద్రాలు స్థానిక ప్రజల కోసం అందుబాటులో ఉంచారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో తిరుమలకు వచ్చిన భక్తుల చిన్నారులతో పాటు స్థానికంగా నివసిస్తున్న ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేశారు.
అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, సీఆర్‌వో, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, కల్యాణకట్ట, వరాహస్వామి ఆలయం, పాపవినాశనం, అలిపిరి నడకదారి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా మొత్తం 5,255 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించారు.

వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, టీటీడీ అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించాలంటే ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్యులు, అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)