అఖిల్‌కు సమంత బెస్ట్ విషెస్.. ‘లెనిన్’బిగ్ బ్లాక్‌బస్టర్ అవుతుందంటూ పోస్ట్
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా అఖిల్‌తో పాటు ‘లెనిన్’ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మూవీ ట్రైలర్‌ను షేర్ చేసిన సమంత..“లెనిన్ టీమ్‌కు, అఖిల్‌కు ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పటికే బిగ్ బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి” అంటూ పోస్ట్ చేశారు. సమంత శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల అఖిల్ కూడా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ‘లెనిన్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ట్రైలర్ తనకు ఎంతో నచ్చిందని, సినిమా కాన్సెప్ట్ చాలా ఫ్రెష్‌గా ఉందని చెప్పారు.‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్‌తో మహిళా ప్రధాన పాత్రలో యాక్షన్‌ను చూపించడం ఆసక్తికరంగా అనిపించింది. సినిమా వైబ్ అద్భుతంగా ఉంది. సమంత నటన కూడా ప్రశంసనీయం. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అనిపించింది” అని అఖిల్ పేర్కొన్నారు.ఇప్పుడు అఖిల్ సినిమా విడుదల సందర్భంగా సమంత కూడా శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
ఇక ‘లెనిన్’ సినిమాకు మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. రాయలసీమ నేపథ్యంలోని రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ తొలిసారిగా మాస్ పాత్రలో కనిపించారు. నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)