జాన్వీ చేతిపై ‘శిఖు’మెహందీ.. సోదరి పెళ్లిలో లవ్ సిగ్నల్స్..
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది. బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో జాన్వీ సంప్రదాయ లుక్‌తో ఆకట్టుకోవడమే కాకుండా, ఆమె చేతిపై కనిపించిన మెహందీ డిజైన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అన్షులా కపూర్ ఇటీవల రచయిత రోహన్ టక్కర్‌ను వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కు జాన్వీ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన కాంచీవరం పట్టు చీర, స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌లో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
అయితే ఆ ఫోటోల్లో అందరి దృష్టిని ఆకర్షించింది జాన్వీ చేతిపై ఉన్న మెహందీ. అందులో ‘శిఖు’అనే పేరు స్పష్టంగా కనిపించింది. ‘శిఖు’ అనేది శిఖర్ పహారియా ముద్దుపేరు కావడంతో, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలాకాలంగా జాన్వీ, శిఖర్ పహారియా ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
జాన్వీ తన ప్రేమను పరోక్షంగా వ్యక్తపరచడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘శిఖు’పేరు ఉన్న నెక్లెస్ ధరించడం, శిఖర్ పేరుతో ఉన్న టీ-షర్టులు, నైట్ సూట్‌లతో కనిపించడం ద్వారా కూడా ఆమె వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మెహందీలోనే ‘శిఖు’పేరును పొందుపరచడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
శిఖర్ పహారియా కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. జాన్వీ, శిఖర్ 2016 నుంచే డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. మధ్యలో విడిపోయారనే ప్రచారం జరిగినప్పటికీ, 2023లో మళ్లీ ఒక్కటయ్యారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇద్దరూ పలు పబ్లిక్ ఈవెంట్లు, కుటుంబ వేడుకలు, విదేశీ పర్యటనలు, ఆలయ దర్శనాల్లో కలిసి కనిపిస్తున్నారు. తిరుమల శ్రీవారిని కూడా పలుమార్లు కలిసి దర్శించుకున్నారు.
ప్రస్తుతం జాన్వీ మెహందీలో కనిపించిన ‘శిఖు’పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కెరీర్ విషయానికి వస్తే... దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్, ‘దేవర’చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల ఆమె నటించిన ‘పెద్ది’సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రస్తుతం ఆ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)