తిరుమలలో వైభవంగా పల్లవోత్సవం.. మైసూరు సంస్థానం ఆతిథ్యం స్వీకరించిన మలయప్పస్వామి
తిరుమలలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి పల్లవోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది నిర్వహించే ఈ ఉత్సవాన్ని టీటీడీ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తోంది.
సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆలయం నుంచి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి విచ్చేశారు. అక్కడ మైసూరు సంస్థానం తరఫున స్వామివారికి ఘన స్వాగతం పలికి సంప్రదాయబద్ధంగా ఆతిథ్యం అందించారు.
అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామివారికి ప్రత్యేక హారతి సమర్పించి స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నరేష్, శ్రీ దర్శన్, పేష్కార్ శ్రీ రామకృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)