2030 కామన్వెల్త్‌కు భారత్ రెడీ.. అధికారికంగా బాధ్యతల స్వీకరణ
స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా 11 రోజుల పాటు జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య బాధ్యతలను స్కాట్లాండ్ అధికారికంగా భారత్‌కు అప్పగించింది. ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష, గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వి కామన్వెల్త్ జెండా, బాటన్‌ను స్వీకరించారు.
జెండా స్వీకరణ అనంతరం భారత్ 'వసుధైవ కుటుంబకం' భావనను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకుంది. అహ్మదాబాద్ నగరం, ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన నిర్వహించారు. 2010 ఢిల్లీ గేమ్స్ తర్వాత రెండోసారి భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుండగా, 2030 అహ్మదాబాద్ గేమ్స్‌కు అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)