మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్ భూషణ్‌..

Aug 03, 2026 - 18:32
0 4
మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్ భూషణ్‌..

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బ్రిజ్ భూషణ్‌తో పాటు మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌ను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

2023లో ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదు మేరకు బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపులు, బెదిరింపులకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, మహిళా రెజ్లర్లు ఆయన అరెస్ట్ కోసం భారీ ఆందోళనలు నిర్వహించారు. విచారణ అనంతరం ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

తీర్పు అనంతరం స్పందించిన బ్రిజ్ భూషణ్.. తాను మొదటి నుంచే నిర్దోషినని చెబుతూ వచ్చానని, కోర్టు తీర్పుతో నిజం బయటపడిందని అన్నారు. ఈ తీర్పు తనకు, తన మద్దతుదారులకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User