దుర్గమ్మకు రూ.17 లక్షల బంగారు లక్ష్మీ కాసుల హారం..

Aug 03, 2026 - 18:30
0 3
దుర్గమ్మకు రూ.17 లక్షల బంగారు లక్ష్మీ కాసుల హారం..

ఆషాఢ మాసోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాలను కానుకగా సమర్పిస్తున్నారు.

సోమవారం దొండేటి ఐశ్వర్య జ్యోతి కుటుంబ సభ్యులు అమ్మవారికి రూ.17 లక్షల విలువైన 108 గ్రాముల బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని సమర్పించారు. ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలను ఆశీర్వదించారు. అంతకుముందు విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు రూ.2.5 లక్షల విలువైన బంగారు బొట్టు, నత్తు, బొల్లాకిని అమ్మవారికి కానుకగా అందజేశారు.

ఆదివారం ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా రికార్డు స్థాయిలో సుమారు 35 వేల మంది భక్తులు వందకు పైగా భక్తి బృందాలుగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయం, ఘాట్ రోడ్డు, మహామండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User