తెలంగాణ అమ్మాయిలకు గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్ పూర్తయితే ఉచిత పైలట్ ట్రైనింగ్

Aug 05, 2026 - 13:39
0 8
తెలంగాణ అమ్మాయిలకు గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్ పూర్తయితే ఉచిత పైలట్ ట్రైనింగ్

తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కమర్షియల్ పైలట్‌గా ఎదగాలనే కల కలిగిన పేదింటి అమ్మాయిల కోసం ఇంటర్ విద్యాశాఖ, ఇండిగో సంస్థ సీఎస్‌ఆర్ విభాగం IndiGoReach, భారత్ కేర్ ట్రస్ట్ కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

ఈ మేరకు మూడు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. Giving Wings to Fly కార్యక్రమం కింద ఎంపికైన విద్యార్థినులకు అంతర్జాతీయ ప్రమాణాలతో 20 నెలల పాటు కమర్షియల్ పైలట్ శిక్షణ అందించనున్నారు.

శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు Commercial Pilot Licence (CPL)తో పాటు ATR Type Rating కూడా అందిస్తారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో పైలట్‌గా ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో శిక్షణ ఫీజుతో పాటు వసతి, భోజనం, వైద్య బీమా, మెంటార్‌షిప్, కెరీర్ గైడెన్స్, ఏటీఆర్ టైప్ రేటింగ్ వంటి అన్ని సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. విద్యార్థినులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని అధికారులు తెలిపారు.

ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఈ కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన అమ్మాయిలు కూడా విమానయాన రంగంలో ఉన్నత స్థాయి కెరీర్‌ను నిర్మించుకునే అవకాశం లభించనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User