రూ.110 కోట్ల బడ్జెట్‌తో 'నాగబంధం'.. 5 వేల మంది డ్యాన్సర్లతో 'నమోరే' సాంగ్!

Jun 30, 2026 - 15:51
0 2
రూ.110 కోట్ల బడ్జెట్‌తో 'నాగబంధం'.. 5 వేల మంది డ్యాన్సర్లతో 'నమోరే' సాంగ్!

భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, మైథలాజికల్ టచ్‌తో తెరకెక్కిన 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్' సినిమాపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో నభా నటేష్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నభా నటేష్, ఈ మూవీ తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని చెప్పింది. ఇందులో ఆమె 'పార్వతి' అనే వేద విద్యార్థిని పాత్రలో కనిపించనుంది. కథలో కీలకమైన ఈ పాత్ర కోసం లుక్, మేకప్, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రతిరోజూ దాదాపు రెండు గంటల పాటు మేకప్, కాస్ట్యూమ్స్‌కే సమయం పట్టేదని తెలిపింది.

ఈ చిత్రాన్ని సుమారు రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు నభా వెల్లడించింది. సినిమా కోసం 10కి పైగా భారీ సెట్లను నిర్మించారని, అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని పోలిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ జరిపిన అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సెట్‌లో చిత్రీకరణ సమయంలో ప్రతి రోజు పూజ చేసిన తర్వాతే షూటింగ్ ప్రారంభించేవారని, యూనిట్ సభ్యులంతా శాకాహారమే తీసుకున్నారని తెలిపింది.

సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచే 'నమోరే' పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆధ్వర్యంలో ఏకంగా 5 వేల మంది డ్యాన్సర్లతో చిత్రీకరించినట్లు నభా వెల్లడించింది. ఈ పాట థియేటర్లలో ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

అలాగే సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తాయని, ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారని నభా తెలిపింది. భారీ నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో జూలై 3న తేలనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User