కామన్వెల్త్లో భారత్ కొత్త చరిత్ర.. బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత బాక్సర్లు చరిత్ర సృష్టించారు. బాక్సింగ్‌లో ఏకంగా 10 మంది భారతీయులు సెమీఫైనల్స్‌కు చేరడంతో కనీసం 10 పతకాలు ఖాయమయ్యాయి. 1934లో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత భారత్ బాక్సింగ్‌లో ఇంత పెద్ద విజయాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి.
మహిళల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్, ప్రీతి పవార్, ప్రియా ఘంఘాస్, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, జాస్మిన్ లాంబోరియా సెమీస్‌కు చేరగా.. పురుషుల విభాగంలో జాదుమణి సింగ్, సచిన్ సివాచ్, అంకుష్ పంఘాల్, నరేందర్ బెర్వాల్ కూడా పతకాలను ఖాయం చేశారు.
ఇప్పటికే భారత్‌కు మొత్తం 22 పతకాలు ఖాయమయ్యాయి. గతంలో 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో సాధించిన 9 బాక్సింగ్ పతకాల రికార్డును అధిగమిస్తూ కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు భారత అభిమానుల దృష్టి బంగారు పతకాలపై నిలిచింది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)