చివరి వరల్డ్‌కప్‌కు ఎమోషనల్ ఎండ్.. రొనాల్డో కంటతడి

Jul 07, 2026 - 14:03
0 2
చివరి వరల్డ్‌కప్‌కు ఎమోషనల్ ఎండ్.. రొనాల్డో కంటతడి

అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓడిన పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదనపు సమయంలో మికెల్ మెరినో చేసిన ఏకైక గోల్ స్పెయిన్‌కు విజయాన్ని అందించగా, ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ కలకు భావోద్వేగ ముగింపు పలికింది.

మ్యాచ్ ముగిసిన వెంటనే రొనాల్డో కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. ఇప్పటికే ఇదే తన చివరి ప్రపంచకప్ అని ప్రకటించిన రొనాల్డో.. మరోసారి జట్టును క్వార్టర్ ఫైనల్‌కు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయాడు.

2006లో ప్రపంచకప్ అరంగేట్రం చేసిన రొనాల్డో.. వరుసగా ఆరు ప్రపంచకప్‌లలో పాల్గొన్న అరుదైన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు, ఆరు ప్రపంచకప్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలో 27 మ్యాచ్‌లు ఆడి మొత్తం 11 గోల్స్ నమోదు చేశాడు. అయినప్పటికీ ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అతడికి అందని కలగానే మిగిలిపోయింది.

మరోవైపు స్పెయిన్ చరిత్రాత్మక రికార్డులు నమోదు చేసింది. వరుసగా ఆరు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ప్రపంచ రికార్డు సృష్టించింది. గోల్‌కీపర్ ఉనై సిమోన్ వరుసగా 609 నిమిషాల పాటు గోల్ ఇవ్వకుండా నిలిచి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక క్లీన్‌షీట్ నిమిషాల రికార్డును నెలకొల్పాడు.

ఈ విజయంతో స్పెయిన్ 16 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు టైటిల్ వేటలో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. మరోవైపు ఫుట్‌బాల్ అభిమానులు మాత్రం రొనాల్డో ప్రపంచకప్ కెరీర్‌కు భావోద్వేగ వీడ్కోలు పలుకుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User