ICC వరల్డ్‌కప్ 2027 వేదికలు ఖరారు.. మూడు దేశాల్లో 12 స్టేడియాల్లో మెగా టోర్నీ
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పురుషుల వన్డే ప్రపంచకప్ 2027 కోసం ఆతిథ్య వేదికలను అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 'Three Nations, One Heartbeat' అనే థీమ్‌తో ఈ ప్రకటన విడుదలైంది. ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
2027 ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొనగా, 57 మ్యాచ్‌లు 12 వేదికల్లో నిర్వహించనున్నారు. వీటిలో దక్షిణాఫ్రికాలో 8 స్టేడియాలు, జింబాబ్వేలో 3 స్టేడియాలు, నమీబియాలో ఒక స్టేడియం ఎంపికయ్యాయి. 2003 ప్రపంచకప్ తర్వాత ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న తొలి పురుషుల వన్డే ప్రపంచకప్ కావడం ఈ టోర్నీ ప్రత్యేకత.
ఈ సందర్భంగా స్పందించిన ICC ఛైర్మన్ జై షా.. 24 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ మళ్లీ ఆఫ్రికాకు రావడం క్రికెట్ చరిత్రలో కీలక ఘట్టమని అన్నారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా కలిసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు గుర్తుంచుకునేలా అద్భుతమైన టోర్నీని నిర్వహిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్‌తో ఆఫ్రికాలో క్రికెట్ మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు.
ప్రపంచకప్ 2027 ఆతిథ్య వేదికలు
దక్షిణాఫ్రికా
* వాండరర్స్ స్టేడియం – జోహన్నెస్‌బర్గ్
* సూపర్‌స్పోర్ట్ పార్క్ – సెంచూరియన్
* న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ – కేప్‌టౌన్
* కింగ్స్‌మీడ్ – డర్బన్
* సెయింట్ జార్జ్ పార్క్ – గ్కెబెర్హా
* మాంగాంగ్ ఓవల్ – బ్లోమ్ఫొంటైన్
* బోలాండ్ పార్క్ – పార్ల్
* బఫెలో పార్క్ – ఈస్ట్ లండన్ (బఫెలో సిటీ)
జింబాబ్వే
* హరారే స్పోర్ట్స్ క్లబ్ – హరారే
* క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ – బులవాయో
* ఫాలే మోసి-ఓ-తున్యా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం – విక్టోరియా ఫాల్స్
నమీబియా
* నమీబియా క్రికెట్ గ్రౌండ్ – విండ్‌హోక్
ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, మ్యాచ్ తేదీలు, ప్రారంభ మ్యాచ్, ఫైనల్ వేదిక వంటి వివరాలను ఐసీసీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)