బ్యాంకాక్‌లో పూరి జగన్నాథ్‌కు VIP ట్రీట్‌మెంట్.. కారణం ప్రభాస్ ఒక్క ఫోటోనే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్లోబల్ క్రేజ్ మరోసారి చర్చనీయాంశమైంది.విదేశాల్లో కూడా ప్రభాస్‌కు ఉన్న అభిమానాన్ని తెలియజేసే ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్కు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా విడుదలైన "Baahubali: The Torch Bearer" డాక్యుమెంటరీలో ప్రభాస్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 'బాహుబలి' తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలో, దర్శకుడు పూరి జగన్నాథ్ ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స కోసం బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు.సాధారణ పేషెంట్‌లా వెయిటింగ్ హాల్‌లో కూర్చున్న పూరిని చూసిన ఓ నర్స్.. "ఇండియా నుంచి వచ్చారా?" అని అడిగి, వెంటనే "బాహుబలి?" అంటూ ప్రశ్నించిందట. అప్పుడే తన మొబైల్‌లో ఉన్న ప్రభాస్‌తో దిగిన ఫోటోను చూపిస్తూ.. "హీ ఈజ్ మై ఫ్రెండ్" అని పూరి చెప్పారట.ఆ ఒక్క ఫోటోతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రభాస్ తెలిపారు. నర్స్ వెంటనే చీఫ్ డాక్టర్‌కు సమాచారం ఇవ్వడంతో.. కాసేపటి క్రితం వరకు వెయిటింగ్‌లో ఉన్న పూరికి నేరుగా VIP ట్రీట్‌మెంట్ లభించిందట. ప్రత్యేక గదిలో పూరికి చికిత్స అందించి, ఎలాంటి ఆలస్యం లేకుండా వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ వాయిస్ మెసేజ్ రూపంలో ప్రభాస్‌కు పంపారు. ఆ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఉన్న ప్రభాస్ ఆ మెసేజ్‌ను వారికి వినిపించగా.. థాయ్‌లాండ్‌లో కూడా ప్రభాస్‌కు ఇంతటి గుర్తింపు ఉందని తెలిసి రాజమౌళి సైతం ఆశ్చర్యపోయారని ప్రభాస్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఇది రీల్ స్టార్‌డమ్ కాదు.. రియల్ గ్లోబల్ క్రేజ్" అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కు వచ్చిన అంతర్జాతీయ గుర్తింపుకు ఈ సంఘటన మరో బలమైన ఉదాహరణగా నిలిచిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)