భూమికను అందుకే చంపాలనిపించింది.. హీరో శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్

Jul 09, 2026 - 19:12
0 2
భూమికను అందుకే చంపాలనిపించింది.. హీరో శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ నటుడు శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేసిన అనుభవాల నుంచి, నటుడి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ల వరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హీరోయిన్ భూమికకు సంబంధించిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు శంకర్ క్రమశిక్షణకు మరో పేరు అని శ్రీరామ్ అన్నారు. ఉదయం 7 గంటలకు షూటింగ్ అంటే, శంకర్ 6:30 గంటలకే సెట్స్‌కు వచ్చేవారని తెలిపారు. దర్శకుడు వచ్చిన తర్వాతే నటులు సెట్స్‌లోకి రావాలనే నిబంధన ఉండేదని చెప్పారు. హిట్లు వచ్చిన తర్వాత కూడా శంకర్ ఎప్పుడూ ఒదిగి ఉండేవారని, ఆ వినయం ప్రతి దర్శకుడు నేర్చుకోవాల్సిన గుణమని కొనియాడారు.'3 ఇడియట్స్' రీమేక్‌గా తెరకెక్కిన 'స్నేహితుడు' సినిమాలో నటించడం తనకు పెద్ద సవాలుగా మారిందని శ్రీరామ్ చెప్పారు. ఇప్పటికే ప్రేక్షకులకు తెలిసిన పాత్రను కొత్తగా చూపించేందుకు ఎంతో కష్టపడ్డానని, పాత్ర కోసం బరువు తగ్గడం, లుక్ మార్చుకోవడం వంటి శారీరక మార్పులు కూడా చేశానని వెల్లడించారు.

ఈ సందర్భంగా తన తొలి చిత్రం 'రోజా కూటం' షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. హీరోయిన్ భూమిక ఓ పాట చిత్రీకరణ జరుగుతుండగా మధ్యలోనే షూటింగ్ నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఆ సమయంలో తనకు తీవ్ర కోపం వచ్చిందని, "చేతిలో కత్తి ఉంటే పొడిచేసేవాడిననేంత కోపం వచ్చింది" అని అన్నారు. అయితే అది నిజంగా చెప్పిన బెదిరింపు కాదని, ఆ క్షణంలో వచ్చిన ఆవేశాన్ని సరదాగా వ్యక్తం చేసిన మాట మాత్రమేనని స్పష్టం చేశారు.ఆ తర్వాత ఎయిర్‌పోర్టులో భూమికను కలిసినప్పుడు ఆ సంఘటనను ఇద్దరూ నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నామని శ్రీరామ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అలాగే, నటుడి జీవితం బయటకు కనిపించినంత సులభం కాదని శ్రీరామ్ అన్నారు. ప్రాజెక్టులు మారిపోవడం, మార్కెట్ ఒత్తిళ్లు, ఇండస్ట్రీ రాజకీయాలు, విమర్శలు, కెరీర్‌పై అనిశ్చితి వంటి ఎన్నో సవాళ్లను నటులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User