మొగుడు తప్ప అన్నీ ఉన్నాయి.. పెళ్లిపై నందిని రెడ్డి బోల్డ్ కామెంట్స్
టాలీవుడ్ ప్రముఖ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, పెళ్లి, ఒంటరితనం, జీవిత దృక్పథం గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు.
50 ఏళ్లు దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంపై స్పందించిన నందిని రెడ్డి, తన మెంటాలిటీకి సరిపోయే వ్యక్తి దొరకకపోవడం వల్లే సింగిల్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. పెళ్లి అనేది జీవితంలో తప్పనిసరి నియమం కాదని, అది వ్యక్తిగత ఎంపిక మాత్రమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
జీవితంలో ఒంటరితనం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “జీవితంలో నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే. మిగతా అన్ని బంధాలు ఉన్నాయి” అంటూ బోల్డ్‌గా వ్యాఖ్యానించారు. మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, సహచరులు తన జీవితాన్ని నింపేశారని, అందుకే తాను ఎప్పుడూ లోన్లీగా ఫీల్ కాలేదని చెప్పారు.
డబ్బు, ఆస్తులపై తన దృక్పథం గురించి మాట్లాడుతూ, సంపాదన కంటే మనశ్శాంతే ముఖ్యమని నందిని రెడ్డి పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక విషయాలపై పెద్దగా ఆసక్తి చూపనందున, తన ఫ్రెండ్ బలవంతంతో ఒక ఫ్లాట్ కొనాల్సి వచ్చిందని కూడా నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.వీకెండ్స్‌లో ఇంట్లోనే ఉంటూ తన పెట్ డాగ్స్‌తో సమయం గడపడం, పుస్తకాలు చదవడం, వంట చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. తన మనశ్శాంతికి భంగం కలిగించే వ్యక్తులు లేదా పరిస్థితులను జీవితంలో నుంచి తొలగిస్తానని కూడా ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరోసారి విజయాన్ని అందుకున్న నందిని రెడ్డి, కెరీర్ పరంగా కూడా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)