సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్న 'కలర్స్' స్వాతి.. డైరెక్టర్తో కొత్త జీవితానికి శ్రీకారం

Jul 08, 2026 - 19:30
0 2
సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్న 'కలర్స్' స్వాతి.. డైరెక్టర్తో కొత్త జీవితానికి శ్రీకారం

తెలుగు సినీ ప్రేక్షకులకు 'కలర్స్' స్వాతిగా ఎంతో దగ్గరైన నటి స్వాతి రెడ్డి జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ నాగోటితో జూలై 8న వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పెళ్లికి సంబంధించిన అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకోవడంతో ఈ వార్త ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఎలాంటి హడావుడి లేకుండా, ముందస్తు ప్రచారం లేకుండానే ఈ వివాహం జరగడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్వాతి షేర్ చేసిన వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'మంత్ ఆఫ్ మధు'తో మొదలైన ప్రేమ

స్వాతి రీఎంట్రీ ఇచ్చిన 'మంత్ ఆఫ్ మధు' చిత్రానికి శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కొంతకాలం తమ బంధాన్ని గోప్యంగా ఉంచిన ఈ జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైంది.

గతంలో వికాస్ వాసుతో వివాహం

స్వాతి 2018లో మలయాళీ పైలట్ వికాస్ వాసును వివాహం చేసుకున్నారు. అనంతరం కొన్నేళ్లకు ఇద్దరూ విడిపోయారు. అయితే తమ వ్యక్తిగత జీవితంపై వచ్చిన వార్తల గురించి స్వాతి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. ఇప్పుడు రెండో వివాహాన్ని స్వయంగా ప్రకటించడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది.

శుభాకాంక్షలు వెల్లువ

స్వాతి-శ్రీకాంత్ నాగోటి దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంచు లక్ష్మి, నవీన్ చంద్ర, దర్శకురాలు నందిని రెడ్డి, శ్వేతా ధన్వంతరి తదితరులు సోషల్ మీడియా ద్వారా కొత్త జంటకు అభినందనలు తెలియజేశారు.

సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి... ఇప్పుడు జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఈ కొత్త ప్రయాణంలో స్వాతి-శ్రీకాంత్ నాగోటి దంపతులు ఆనందంగా, సంతోషంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User