116 ఏళ్ల బామ్మ తిరుమల మెట్లెక్కి శ్రీవారి దర్శనం..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు చేరుకుంటుంటారు. వారిలో కొందరు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో కాలినడకన కొండపైకి చేరుకుని తమ భక్తిని చాటుకుంటారు. అయితే తాజాగా 116 ఏళ్ల వృద్ధురాలు కాలినడకన తిరుమల మెట్లెక్కి స్వామివారి దర్శనానికి వెళ్లిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కర్ణాటకకు చెందిన ఈ బామ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా, మరో భక్తురాలు ఆమెను పలకరించి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం యువతలో కూడా చాలామంది నడక మార్గంలో వెళ్లడానికి వెనుకాడుతున్న పరిస్థితుల్లో, 116 ఏళ్ల వయసులోనూ ఈ బామ్మ చూపించిన మనోబలం, అచంచలమైన దైవభక్తి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. "వయసు కాదు... సంకల్పమే గొప్పది" అని పలువురు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)