అక్టోబర్ తిరుమల దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ కోటా?

Jul 14, 2026 - 12:20
0 3
అక్టోబర్ తిరుమల దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ కోటా?

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని అక్టోబర్ నెలలో దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్లు, వృద్ధులు–దివ్యాంగుల ఉచిత దర్శనం, అలాగే తిరుమల–తిరుపతి వసతి గదుల బుకింగ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.

జూలై 18 ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రారంభమవుతుంది. జూలై 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపికైన భక్తులు జూలై 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు టికెట్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

జూలై 21 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లు విడుదల కానుండగా, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్లు అందుబాటులోకి వస్తాయి.

జూలై 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ప్రత్యేక ఉచిత దర్శన టోకెన్ల కోటా విడుదల కానుంది.

జూలై 24 ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుండగా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల బుకింగ్ కోటా అందుబాటులోకి రానుంది.

అక్టోబర్ నెలలో శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులు ఈ తేదీలను ముందుగానే గుర్తుంచుకుని, నిర్ణీత సమయానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User