నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. జూలై 22న ధ్వజారోహణంతో ప్రారంభం

Jul 21, 2026 - 13:27
0 3
నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. జూలై 22న ధ్వజారోహణంతో ప్రారంభం

కడప జిల్లా నందలూరులోని ప్రాచీన, ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూలై 21 సాయంత్రం 6 గంటలకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడుతారు. అనంతరం జూలై 22 ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.

ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ దీపాలంకరణలు, రంగవల్లులతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు శ్రీ సౌమ్యనాథ స్వామివారు వివిధ దివ్య వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూలై 22న యాలి వాహనం, జూలై 23న హంస వాహనం, జూలై 24న సింహ వాహనం, జూలై 25న హనుమంత వాహనం, జూలై 26న గరుడ వాహనం, జూలై 27న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహిస్తారు. జూలై 28న ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం, జూలై 29న రథోత్సవం, అశ్వవాహనం, జూలై 30న చక్రస్నానం, ధ్వజావరోహణం, జూలై 31 సాయంత్రం 6 గంటలకు పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

జూలై 28న నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో గృహస్థ దంపతులు రూ.500 చెల్లించి పాల్గొనవచ్చు. పాల్గొనే ప్రతి దంపతులకు ఉత్తరీయం, రవికెతో పాటు అన్నప్రసాదాలను టీటీడీ అందజేయనుంది.

అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీతం, హరికథలు, సంకీర్తనలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్య బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని టీటీడీ కోరింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User