"ఏపీ మాకు ఎప్పుడూ ప్రత్యేకమే".. లోకేష్ ట్వీట్‌కు గల్లా జయదేవ్ భావోద్వేగ స్పందన
మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్‌కు అమర రాజా గ్రూప్ సీఎండీ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. "అమర రాజా ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రారంభమైంది. ఆ రాష్ట్రం మాకు ఎప్పటికీ ప్రత్యేకమే. మా మూలాలు అక్కడే ఉన్నాయి.. మా నిబద్ధత కూడా అలాగే కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కలిసి మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ఉజ్వల భవిష్యత్తు నిర్మిద్దాం" అని ట్వీట్ చేశారు.
ఇటీవల తెలంగాణలో అమర రాజా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభం సందర్భంగా స్పందించిన మంత్రి లోకేష్.. గత ప్రభుత్వ హయాంలో అమర రాజాపై జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ, "ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణలు చెబుతోంది" అని ట్వీట్ చేశారు. అమర రాజా రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడిన ఆయన.. భవిష్యత్తులో సంస్థ మరోసారి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆకాంక్షించారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమర రాజా సంస్థ రూ.9,500 కోట్ల లిథియం-అయాన్ గిగా కారిడార్ ప్రాజెక్టును తెలంగాణకు తరలించిన విషయం తెలిసిందే. ఇప్పుడు లోకేష్, గల్లా జయదేవ్ ట్వీట్లు రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)