ఏపీలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..? శ్రావణంలో ప్రకటన?

Aug 03, 2026 - 18:29
0 2
ఏపీలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..? శ్రావణంలో ప్రకటన?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుందా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అధికార టీడీపీ, మాజీ పార్టీ వైసీపీ రెండింటిపైనా విమర్శలు చేస్తున్న విజయసాయి.. ఇప్పుడు సొంత రాజకీయ వేదికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

శ్రావణ మాసంలో కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. యువత, మహిళలు, రైతులను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పార్టీ అజెండా రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే హిందుత్వం, సామాజిక న్యాయం, పారదర్శక రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తూ 2029 ఎన్నికలను లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే చర్చ సాగుతోంది.

అయితే ఇప్పటివరకు విజయసాయిరెడ్డి నుంచి కొత్త పార్టీపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. నిజంగా కొత్త పార్టీ ప్రకటిస్తారా? లేక ఈ ప్రచారాలకు తెరపడుతుందా? అన్నది అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టత రానుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User