ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రూ.2,000 కోట్ల బిజినెస్ సామ్రాజ్యం

Jul 31, 2026 - 13:02
0 3
ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రూ.2,000 కోట్ల బిజినెస్ సామ్రాజ్యం

90వ దశకంలో దక్షిణాది సినీ పరిశ్రమను తన అందం, నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ రంభ ప్రస్తుతం మరో కారణంతో వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు భారీ వ్యాపార కుటుంబంలో భాగస్వామిగా విజయవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకున్న రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడిన ఆమె.. టెలివిజన్ షోలలో జడ్జిగా కనిపిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.

ఇటీవల ఓ సినీ కార్యక్రమంలో నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ.. రంభ కుటుంబ ఆస్తుల విలువ సుమారు రూ.2,000 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆమె భర్త ఇంటీరియర్ డిజైన్ రంగంలో పేరొందిన 'మ్యాజిక్ వుడ్స్'తో పాటు మొత్తం ఐదు కంపెనీల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో రంభ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే దీనిపై ఆమె నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User