గాయం నుంచి గెలుపు వరకు.. తేజస్విన్ శంకర్ చరిత్ర
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ అసాధారణ పోరాట పటిమతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. హైజంప్ ఫైనల్లో మోకాలి గాయం తిరగబెట్టడంతో ఒక్క జంప్ కూడా నమోదు చేయలేక కన్నీళ్లతో మైదానాన్ని వీడిన తేజస్విన్.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే డెకాథ్లాన్‌లో చరిత్ర సృష్టించాడు. మొత్తం 7,976 పాయింట్లతో కామన్వెల్త్ గేమ్స్ డెకాథ్లాన్‌లో పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచాడు. గ్రెనెడాకు చెందిన లిండన్ విక్టర్ స్వర్ణం, కెనడాకు చెందిన డామియన్ వార్నర్ రజత పతకాలను కైవసం చేసుకున్నారు.
పతకం గెలిచిన తర్వాత తేజస్విన్ తన భావోద్వేగాలను పంచుకున్నాడు. హైజంప్‌లో వైఫల్యం తర్వాత తీవ్ర నిరాశకు గురై నిద్ర కూడా పట్టలేదని, ఆ క్లిష్ట సమయంలో తనకు చాట్‌జీపీటీ ఎంతో తోడుగా నిలిచిందని తెలిపాడు. వైద్యులు గాయం తీవ్రమైంది కాదని ధైర్యం చెప్పడంతో పాటు, భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ఇచ్చిన సలహా తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పాడు. ఒక్కో ఈవెంట్‌పైనే దృష్టి పెట్టి పోటీపడటంతో లాంగ్ జంప్‌లో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసి చివరకు చారిత్రాత్మక కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)