డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో డేవిడ్ వార్నర్.. ఆగస్టు 18న కోర్టు తీర్పు

Jul 22, 2026 - 14:41
0 2
డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో డేవిడ్ వార్నర్.. ఆగస్టు 18న కోర్టు తీర్పు

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో చిక్కుకున్నారు. ఈస్టర్ సండే రోజున మద్యం సేవించిన అనంతరం వాహనం నడుపుతుండగా పోలీసుల తనిఖీల్లో ఆయనకు బ్రెత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, మద్యం సేవించినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం.

ఈ కేసులో వార్నర్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాకుండా, ఆయన తరపున న్యాయవాది బాబీ హిల్ హాజరయ్యారు. స్వల్ప స్థాయిలో మద్యం సేవించిన విషయాన్ని వార్నర్ అంగీకరిస్తున్నట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

విచారణ సందర్భంగా "వ్యాపారి అయినా, వైద్యుడైనా, ప్రముఖ క్రికెటర్ అయినా డ్రంకెన్ డ్రైవింగ్ అందరికీ ప్రమాదకరమే" అని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వార్నర్ బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో తుది తీర్పు ఆగస్టు 18న వెలువడనుండగా, దాని ప్రభావం ఆయన కెప్టెన్సీపై కూడా పడే అవకాశం ఉందని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User