పాకిస్థాన్ క్రికెటర్‌ను హగ్ చేసుకున్న భారత్ స్టార్ క్రికెటర్

Aug 01, 2026 - 14:36
0 2
పాకిస్థాన్ క్రికెటర్‌ను హగ్ చేసుకున్న భారత్ స్టార్ క్రికెటర్

ది హండ్రెడ్ మహిళల లీగ్‌లో భారత్ స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్, పాకిస్థాన్ క్రికెటర్ ఫాతిమా సనా మధ్య చోటుచేసుకున్న ఓ ఆప్యాయ క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదర్న్ బ్రేవ్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం అభినందించుకుంటుండగా.. జెమీమా, ఫాతిమా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది.

2025 పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరు దేశాల క్రికెటర్ల మధ్య ఇలాంటి ఆప్యాయ దృశ్యం కనిపించడం విశేషంగా మారింది. ఈ హగ్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు క్రీడాస్ఫూర్తికి ఇది నిదర్శనమని ప్రశంసిస్తుండగా, మరికొందరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సదర్న్ బ్రేవ్ 100 బంతుల్లో 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. లిజెల్ లీ 43, మాయా బూషియర్ 45 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 18 బంతుల్లో 28 పరుగులతో అజేయంగా నిలిచింది. లక్ష్య ఛేదనలో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ 100 బంతుల్లో 5 వికెట్లకు 116 పరుగులకే పరిమితమైంది. దీంతో సదర్న్ బ్రేవ్ 24 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User