నవగ్రహ దోషాలు వేధిస్తున్నాయా? ఏ గ్రహానికి ఏ పండు దానం చేస్తే శుభఫలితాలు వస్తాయంటే..?

Jul 17, 2026 - 14:52
0 3
నవగ్రహ దోషాలు వేధిస్తున్నాయా? ఏ గ్రహానికి ఏ పండు దానం చేస్తే శుభఫలితాలు వస్తాయంటే..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల అనుకూలత జీవితంపై ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. గ్రహదోషాల నివారణ కోసం పూజలు, జపాలు, దానాలు చేస్తుంటారు. అలాంటి పరిహారాల్లో ఫలదానం కూడా ఒక ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ‘బృహన్నారదీయం’లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆయా గ్రహాలకు ఇష్టమైన పండ్లను దానం చేస్తే గ్రహదోషాల ప్రభావం తగ్గి శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

* సూర్యుడు    – మాతులుంగం (దబ్బపండు/పెద్ద నిమ్మ)
* చంద్రుడు    – అరటిపండ్లు (సోమవారం)
* కుజుడు        – దానిమ్మ (మంగళవారం)
* బుధుడు       – మామిడిపండు (బుధవారం)
* గురుడు        – పనసపండు (గురువారం)
* శుక్రుడు        – ఖర్జూరం (శుక్రవారం)
* శని                – నేరేడు పండ్లు (శనివారం)
* రాహువు         – కొబ్బరికాయ (శనివారం)
*కేతువు            – మాతులుంగం/దబ్బపండు (మంగళవారం)

జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ విధంగా ఫలదానం చేయడం ద్వారా గ్రహాల అనుగ్రహం లభించి శుభఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు.

*గమనిక:* పై వివరాలు జ్యోతిష్య గ్రంథాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే అందించబడినవి. వీటికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. విశ్వసించాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User