పాట పాడతానంటూ ప్రభాస్ రచ్చ
రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన సరదా స్వభావంతో అభిమానులను ఆకట్టుకున్నారు. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నాగ్ అశ్విన్ నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ పాల్గొన్న ఫన్నీ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో నాగ్ అశ్విన్ ఫోన్ చేసి సినిమా చూడమని అడగగా, ప్రభాస్ సరదాగా స్పందిస్తూ “ఫౌజీ, స్పిరిట్ షూటింగ్స్ మధ్యలో ఈ పాటల సినిమా నాకు అవసరమా?”అంటూ హాస్యంగా తప్పించుకునే ప్రయత్నం చేసారు .ఇది అభిమానులను బాగా ఆకట్టుకుంది.

అయితే సినిమా చూసిన తర్వాత ప్రభాస్ పూర్తిగా మారిపోయి, నాగ్ అశ్విన్‌కు ఫోన్ చేసి “కమ్ టు మై రూమ్” అంటూ పిలిచి సినిమా గురించి తన ఫుల్ రివ్యూ చెప్పారు . చిత్ర యూనిట్ పనితీరును ప్రశంసిస్తూ సినిమాను ఆకాశానికెత్తేసారు .
ఇంతటితో ఆగని ప్రభాస్, సరదాగా “నా వాయిస్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? పాటలు పాడటం రాదని అనుకున్నారా? నన్ను ఈ సాంగ్ సినిమాలో ఎందుకు పెట్టుకోలేదు?” అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసారు . చివర్లో తాను కూడా పాట పాడతానంటూ చేసిన సరదా రియాక్షన్ వీడియో హైలైట్‌గా నిలిచింది.
ఈ వీడియోలో ‘కల్కి’సినిమా ప్రస్తావనతో పాటు ప్రభాస్ చూపించిన ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)