“ప్రభాస్ చేయి పడితే చాలు 100 కోట్లు..” సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్‌డమ్ గురించి స్టార్ హీరోయిన్ సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన తాజా చిత్రం మా ఇంటి బంగారం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఎదుగుదల, ఆయన సాధించిన స్టార్‌డమ్ వెనుక ఉన్న ప్రయాణం గురించి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహిళా ప్రాధాన్యత చిత్రాల గురించి మాట్లాడిన సమంత.. అలాంటి సినిమాలకు ఎప్పుడూ ఒక సోషల్ మెసేజ్ ఉండాలనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉందని అన్నారు. మహిళా పాత్రలను కేవలం త్యాగాలు చేసే వ్యక్తులుగా చూపించే పరిమితిని అధిగమించాలని తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
అయితే ఈ ఇంటర్వ్యూలో ఎక్కువగా చర్చనీయాంశమైన విషయం ప్రభాస్ గురించి సమంత చేసిన వ్యాఖ్యలే. ప్రభాస్ స్టార్‌డమ్‌ను ఉదాహరణగా తీసుకున్న సమంత.. “ఇప్పుడు ప్రభాస్ చేయి పడితే చాలు వంద కోట్ల రూపాయలు వస్తాయి. కానీ ఆయనకు ఈ స్థాయి ఒక్కరోజులో రాలేదు. ఎన్నో సంవత్సరాల పాటు దర్శకులు హీరోను ఎలివేట్ చేసే కథలు రాశారు. ప్రేక్షకులు ఆయనపై ప్రేమ, నమ్మకం పెంచుకున్నారు. అందుకే ఈరోజు ప్రభాస్ స్క్రీన్‌పై చిన్న యాక్షన్ చేసినా అభిమానులు సెలబ్రేట్ చేస్తున్నారు” అని అన్నారు.

భవిష్యత్తులో మహిళా ప్రధాన పాత్రల సినిమాలు కూడా అదే స్థాయి మాస్ మార్కెట్‌ను సృష్టించాలని తాను కోరుకుంటున్నానని సమంత తెలిపారు. ప్రస్తుతం ఒక మహిళా ప్రధాన పాత్రకు అలాంటి ఎలివేషన్ షాట్లు ఇస్తే ప్రేక్షకులు అంగీకరించకపోవచ్చని, కానీ రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి మారుతుందని అభిప్రాయపడ్డారు.
సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రభాస్ అభిమానులు ఆమె మాటలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు కూడా ప్రభాస్ స్టార్‌డమ్ వెనుక ఉన్న కష్టం, ప్రయాణాన్ని సమంత చాలా సింపుల్‌గా వివరించారని ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ పేరు ప్రస్తావిస్తూ సమంత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)