మళ్లీ థియేటర్లలోకి ‘కన్నప్ప’.. ఈసారి గట్టెక్కించాల్సింది ప్రభాసేనా?
ఎపిక్ డివోషనల్ డ్రామాగా తెరకెక్కిన కన్నప్ప మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్ 27న రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కన్నప్ప’ మొదటి వారంలో మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ఇప్పుడు రీ-రిలీజ్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సినిమాపై చర్చ మొదలైంది.
ఈ రీ-రిలీజ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ప్రభాస్ పాత్ర. సినిమాలో రుద్రగా కనిపించిన ప్రభాస్ తన ప్రత్యేక స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సినిమాకు మద్దతుగా పోస్టులు చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

పరమశివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషించగా, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ , ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను పూర్తిగా న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. తెలుగు సహా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు రీ-రిలీజ్‌లో ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు మరోసారి థియేటర్లకు తరలివస్తే.. ‘కన్నప్ప’కు రెండో అవకాశం దక్కినట్టే. మరి ఈసారి డార్లింగ్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు పని చేస్తుందో చూడాలి.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)