'రామాయణ'కు కొత్త చిక్కులు.. 'ఆదిపురుష్' తప్పులు చేయొద్దంటూ హెచ్చరిక

Aug 04, 2026 - 13:04
0 3
'రామాయణ'కు కొత్త చిక్కులు.. 'ఆదిపురుష్' తప్పులు చేయొద్దంటూ హెచ్చరిక

దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ మైథాలజీ చిత్రం 'రామాయణ' విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసే ముందు తమకు ప్రత్యేకంగా ప్రదర్శించాలని ఢిల్లీకి చెందిన శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్రబృందానికి లేఖ రాశారు.

లేఖలో గతంలో విడుదలైన 'ఆదిపురుష్' సినిమాను ఉదాహరణగా ప్రస్తావించిన మహాసంఘ్, ఆ చిత్రంలో పాత్రల రూపకల్పన, సంభాషణలు, విజువల్ ప్రెజెంటేషన్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన విషయాన్ని గుర్తుచేసింది. అలాంటి వివాదాలు 'రామాయణ' విషయంలో పునరావృతం కాకుండా ఉండేందుకు ముందుగానే ధార్మిక వేత్తలు, తమ ప్రతినిధుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోరింది.

సినిమాలో సనాతన ధర్మానికి లేదా హిందువుల మనోభావాలకు భంగం కలిగించే సన్నివేశాలు, సంభాషణలు ఏవైనా ఉంటే వాటిని విడుదలకు ముందే తొలగించాలని మహాసంఘ్ విజ్ఞప్తి చేసింది. దీంతో భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండొచ్చని పేర్కొంది.

అయితే ప్రత్యేక ప్రదర్శనకు చిత్రబృందం అంగీకరించకపోతే దేశవ్యాప్తంగా ఇతర హిందూ సంఘాలతో కలిసి థియేటర్ల ముందు నిరసనలు చేపడతామని శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ హెచ్చరించింది.

కాగా, ఈ విషయంపై ఇప్పటివరకు 'రామాయణ' చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User