బిగ్‌బాస్‌కి వెళ్లి ఇమేజ్ డ్యామేజ్ అయింది.. ఇక చస్తే వెళ్లను: హరితేజ ఎమోషనల్ కామెంట్స్

Jul 24, 2026 - 14:07
0 2
బిగ్‌బాస్‌కి వెళ్లి ఇమేజ్ డ్యామేజ్ అయింది.. ఇక చస్తే వెళ్లను: హరితేజ ఎమోషనల్ కామెంట్స్

ఒకప్పుడు తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన నటి హరితేజ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌తో పాటు బిగ్‌బాస్ అనుభవాల గురించి మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా బిగ్‌బాస్ షో తర్వాత తన జీవితంలో ఎదురైన మానసిక ఒత్తిడి, సోషల్ మీడియా విమర్శలు, డిప్రెషన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

హరితేజ మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభంలో పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ వరుసగా పనిమనిషి పాత్రలే రావడంతో 'కాస్ట్లీ పనిమనిషి' అనే ట్యాగ్ వచ్చిందని చెప్పారు. మంచి పాత్రలు వస్తాయని ఆశించినా, ఒకే తరహా పాత్రల్లోనే తనను పరిమితం చేశారని పేర్కొన్నారు.

అయితే తన జీవితంలో బిగ్‌బాస్ పెద్ద మలుపు అని హరితేజ తెలిపారు. షోలో ఉన్నప్పుడు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదని, బయటకు వచ్చిన తర్వాత తనపై వచ్చిన విమర్శలు చూసి తీవ్రంగా షాక్ అయ్యానని చెప్పారు. ఒకప్పుడు తనను అభిమానించిన వారే "పాత హరితేజ కాదు", "షోకి వెళ్లకపోయి ఉంటే బాగుండేది" అంటూ కామెంట్లు చేయడం తనను తీవ్రంగా బాధించిందన్నారు.

ఈ విమర్శల కారణంగా తాను ఆత్మవిశ్వాసం కోల్పోయి డిప్రెషన్‌కు కూడా గురయ్యానని హరితేజ వెల్లడించారు. తాను చేయని తప్పులకు కూడా సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని, ఆ సమయంలో మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.

తనపై వచ్చిన నెగెటివ్ కామెంట్లలో ఎక్కువ భాగం ఫేక్ అకౌంట్లు, పీఆర్ టీమ్‌ల ద్వారా వచ్చాయని తర్వాత తెలిసిందని ఆమె తెలిపారు. అసలు ప్రేక్షకుల నుంచి వచ్చిన నెగెటివ్ స్పందన చాలా తక్కువేనని, నిజం తెలుసుకున్న తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని చెప్పారు.

ప్రస్తుతం తాను మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చానని, ఆ అనుభవం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని హరితేజ అన్నారు. ఇకపై బిగ్‌బాస్‌కు వెళ్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. "ఇక చస్తే కూడా బిగ్‌బాస్‌కి వెళ్లను" అంటూ స్పష్టంగా సమాధానం ఇచ్చారు హరితేజ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User