రోహిత్, కోహ్లి, ధోనీని ఎందుకు పిలవలేదంటే? ఆకాశ్ దీప్ ఫన్నీ రిప్లై వైరల్
టీమిండియా పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ ఇటీవల వారణాసిలో అక్షితా రాజ్‌ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే పెళ్లి వేడుకలో ఓ అతిథి అడిగిన ప్రశ్నకు ఆకాశ్ దీప్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. "విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీని పెళ్లికి ఎందుకు పిలవలేదు?" అని ప్రశ్నించగా.. ఆకాశ్ దీప్ నవ్వుతూ "వాళ్లు వారణాసికి వచ్చి ఉంటే పెళ్లి ఎవరైనా ప్రశాంతంగా జరిగనిచ్చేవారా?" అంటూ చమత్కారంగా బదులిచ్చాడు.
స్టార్ క్రికెటర్లు హాజరైతే భారీగా అభిమానులు తరలివచ్చి వేడుక మొత్తం వారివైపే మళ్లిపోతుందని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించి టీమిండియాలో చోటు సంపాదించిన ఆకాశ్ దీప్, ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో తన ప్రతిభను చాటుకున్నాడు. ఇప్పటివరకు 10 టెస్టుల్లో 28 వికెట్లు సాధించి తనదైన ముద్ర వేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుత బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందాడు.
అయితే వెన్నునొప్పి కారణంగా ఇటీవల క్రికెట్‌కు దూరమైన ఆకాశ్ దీప్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌ను కూడా మిస్ అయిన ఈ పేసర్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)