శ్రీలీలను అందుకే తీసేసాం.. అసలు కారణం చెప్పిన నాగవంశీ..
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'లెనిన్' చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందు సినిమాపై ఆసక్తికర చర్చలు సాగుతున్న వేళ.. ఈ చిత్రంలో హీరోయిన్ మార్పుపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ పూర్తి క్లారిటీ ఇచ్చారు. మొదట హీరోయిన్గా ఎంపికైన శ్రీలీలను కావాలని తప్పించలేదని, కేవలం డేట్స్ సమస్య కారణంగానే ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.
శ్రీలీలను ఎందుకు మార్చాల్సి వచ్చింది?
సినిమా ప్రారంభ దశలో అఖిల్, శ్రీలీల జంటగా షూటింగ్ కూడా మొదలైంది. ఫస్ట్ గ్లింప్స్‌లో శ్రీలీలను పరిచయం చేయగా, పల్లెటూరి అమ్మాయి లుక్‌లో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అనంతరం భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపించాయి.ఈ అంశంపై స్పందించిన నాగవంశీ.. తమవైపు జరిగిన క్రియేటివ్ డిస్కషన్స్ కారణంగా షూటింగ్ ఆలస్యమైందని చెప్పారు. శ్రీలీల ఇచ్చిన డేట్స్‌లో షూటింగ్ జరపలేకపోయామని, ఆ తర్వాత ఆమెకు కార్తీక్ ఆర్యన్ సినిమా, 'పరాశక్తి' వంటి భారీ ప్రాజెక్టులు రావడంతో డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమైందని తెలిపారు.కథలోని కీలక భాగాలను చిత్రీకరించే సమయానికి శ్రీలీల అందుబాటులో లేకపోవడంతో, ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా తీసుకున్నామని స్పష్టం చేశారు.

"శ్రీలీల తప్పు ఏమీ లేదు"
'లెనిన్' రిలీజ్ ప్రెస్మీట్లో కూడా ఇదే విషయాన్ని నాగవంశీ మరోసారి ప్రస్తావించారు. డేట్స్ సమస్య తప్ప శ్రీలీల చేసిన పొరపాటు ఏమీ లేదని, ఆమెపై వస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.హీరోయిన్ మార్పు కారణంగా ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చిందని కూడా వెల్లడించారు.
భాగ్యశ్రీ నటనకు ప్రశంసలు
సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత భాగ్యశ్రీ బోర్సే నటన తనను ఎంతో ఆకట్టుకుందని నాగవంశీ తెలిపారు. దర్శకుడు ఈ పాత్రను భాగ్యశ్రీ కోసమే రాశాడా అన్నంత సహజంగా ఆమె నటించిందని ప్రశంసించారు.అటు హీరో నాగార్జున కూడా భాగ్యశ్రీపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆమె నటన అద్భుతంగా ఉందని, ఈ పాత్ర కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చనే స్థాయిలో పెర్ఫార్మ్ చేసిందని వ్యాఖ్యానించారు.
భాగ్యశ్రీ కెరీర్‌కు కీలకమైన సినిమా
'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే.. గ్లామర్, డ్యాన్స్‌తో యువతలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే వరుసగా నటించిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేదు.ఈ నేపథ్యంలో 'లెనిన్' ఆమె కెరీర్‌కు అత్యంత కీలక చిత్రంగా మారింది. అఖిల్‌తో కలిసి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని భాగ్యశ్రీ ఆశిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రంపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ నెలకొనడంతో.. జూలై 10న ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)