అన్నా లెజినోవా కాదు.. ఇకపై అన్నా కొణిదల

Jul 30, 2026 - 14:34
0 3
అన్నా లెజినోవా కాదు.. ఇకపై అన్నా కొణిదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా తన పేరుకు సంబంధించిన కీలక విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇకపై తన అధికారిక పేరు "అన్నా కొణిదల" అని, "అన్నా లెజినోవా" పేరుతో పిలవొద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు.

పెళ్లి తర్వాత భర్త ఇంటి పేరును తన పేరులో చేర్చుకున్నానని, ప్రస్తుతం అన్ని అధికారిక రికార్డుల్లో తన పేరు అన్నా కొణిదలగానే ఉందని ఆమె తెలిపారు. మ్యారేజ్ సర్టిఫికేట్‌లో మాత్రమే పాత పేరు ఉందని, ఆ తర్వాత అన్ని పత్రాల్లో కొత్త పేరే కొనసాగుతోందని వెల్లడించారు.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఓ అరుదైన ఫొటోను కూడా అన్నా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి అనంతరం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తీసుకున్న ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నా నిర్ణయానికి అభిమానులు మద్దతు తెలుపుతూ ఇకపై "అన్నా కొణిదల"గానే పిలుస్తామని కామెంట్లు చేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User