శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మహా ఏర్పాట్లు.. సమీక్షలో టీటీడీ కీలక నిర్ణయాలు

Jul 10, 2026 - 12:19
0 2
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మహా ఏర్పాట్లు.. సమీక్షలో టీటీడీ కీలక నిర్ణయాలు

తిరుమలలో జరిగే శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమల పద్మావతి అతిథిగృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తిరుపతి జేఈవో డాక్టర్ ఏ. శరత్, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అదనపు ఈవో సమీక్షించారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14న అంకురార్పణ, 15న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సెప్టెంబర్ 19న గరుడసేవ, 22న రథోత్సవం, 23న చక్రస్నానం ప్రధాన ఘట్టాలుగా నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలను కూడా బ్రహ్మోత్సవాల సమయంలో నిలిపివేయనున్నారు.భక్తుల భద్రత కోసం విజిలెన్స్, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక రోడ్ మ్యాప్, పార్కింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయనున్నారు.దర్శన క్యూలైన్లు, మాడవీధులు, గ్యాలరీలలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు.

తిరుమలను విద్యుత్ దీపాలంకరణలు, పూలు, పండ్ల ప్రదర్శనలతో సుందరంగా అలంకరించడంతో పాటు యువతీ, యువకులను శ్రీవారి సేవకులుగా నియమించి భక్తులకు సేవలందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.గరుడసేవ సందర్భంగా భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుంచి సెప్టెంబర్ 20 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. అలాగే భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూలను తగినంతగా నిల్వ ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.భక్తుల సౌకర్యం, భద్రత, ఆధ్యాత్మిక అనుభూతికి ప్రాధాన్యం ఇస్తూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ వేగంగా పూర్తి చేస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User