జూన్‌లో రికార్డు స్థాయిలో 1.27 కోట్ల శ్రీవారి లడ్డూల విక్రయం
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు 2026 జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందించింది.
టీటీడీ గణాంకాల ప్రకారం 2026 ఏప్రిల్‌లో 1,11,96,170 లడ్డూలు ,మేలో 1,21,35,528, జూన్‌లో 1,26,81,805 లడ్డూలు విక్రయమయ్యాయి. గత మూడు నెలలతో పోలిస్తే జూన్ నెలలో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి.
గత సంవత్సరాలతో పోలిస్తే కూడా ఈసారి గణనీయమైన వృద్ధి కనిపించింది. 2024 జూన్‌లో 1,02,64,364, 2025 జూన్‌లో 1,19,21,353 లడ్డూలు విక్రయమవగా, 2026 జూన్‌లో 1,26,81,805 లడ్డూలు విక్రయమయ్యాయి. దీంతో గత ఏడాది జూన్‌తో పోలిస్తే 7,59,452 లడ్డూలు అధికంగా విక్రయమై 6.37 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2024తో పోలిస్తే 24,17,441 లడ్డూలు ఎక్కువగా విక్రయమవ్వడంతో 23.55 శాతం వృద్ధి నమోదైంది.
తిరుమలకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, లడ్డూ తయారీ మరియు పంపిణీలో టీటీడీ సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందిస్తోంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)