శ్రీ పద్మావతి అమ్మవారి తిరువాభరణాల భద్రతపై వచ్చిన వార్త అవాస్తవం.. టీటీడీ స్పష్టీకరణ

Jul 17, 2026 - 14:55
0 3
శ్రీ పద్మావతి అమ్మవారి తిరువాభరణాల భద్రతపై వచ్చిన వార్త అవాస్తవం.. టీటీడీ స్పష్టీకరణ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తిరువాభరణాల భద్రతపై జూలై 16న ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని టీటీడీ స్పష్టం చేసింది. "శ్రీ పద్మావతి అమ్మవారి తిరువాభరణాల పెట్టెకు భద్రత కరువు" అనే వార్తలో పేర్కొన్న అంశాలు నిజం కావని వెల్లడించింది.

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ సమీపంలోని శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన అభిషేకం నిర్వహిస్తారు. ఇందుకోసం పూజా సామగ్రితో పాటు ఒక ఖాళీ చెక్క పెట్టెను మాత్రమే అక్కడికి తీసుకెళ్తారు.

అభిషేకానికి ముందు అమ్మవారి ఉత్సవమూర్తులపై ఉన్న సువర్ణ ఆభరణాలను తీసి ఆ ఖాళీ చెక్క పెట్టెలో భద్రంగా ఉంచుతారు. అభిషేకం పూర్తైన తర్వాత అదే ఆభరణాలను తిరిగి అమ్మవారికి అలంకరించి, అనంతరం ఖాళీ చెక్క పెట్టెను ఉత్సవమూర్తులతో కలిసి ప్రధాన ఆలయానికి తీసుకువస్తారు.

ఈ క్రమంలో శుక్రవారపు తోటకు తీసుకెళ్లే సమయంలో, తిరిగి తీసుకొచ్చే సమయంలో ఆ చెక్క పెట్టె ఖాళీగానే ఉంటుందని, అందువల్ల ప్రత్యేక భద్రత అవసరం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.

ప్రతి శుక్రవారం జరిగే ఈ సంప్రదాయ విధానాన్ని తప్పుగా అర్థం చేసుకుని, భిన్నంగా వార్త ప్రచురించడం బాధాకరమని టీటీడీ పేర్కొంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించడం సరికాదని వెల్లడించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User