"హీరోలకో రూల్..మాకో రూల్ తప్పుకాదా..? –కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు

Jul 06, 2026 - 12:28
0 2
"హీరోలకో రూల్..మాకో రూల్ తప్పుకాదా..? –కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్లకు ఒకే విధమైన గౌరవం, ప్రాధాన్యం దక్కుతున్నాయా..? ఈ ప్రశ్నకు "ఇంకా కాదు" అనే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారితీశాయి.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి సనన్.. చిత్ర పరిశ్రమలో ఇంకా పురుషాధిక్య ధోరణి కొనసాగుతోందని, హీరోలకు ఒక రూల్.. హీరోయిన్లకు మరో రూల్ అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.షూటింగ్ సెట్స్‌లో హీరోలు ఇంకా కారవాన్‌లో సిద్ధం కాకపోయినా.. హీరోయిన్లను మాత్రం ముందుగానే సెట్స్‌పైకి పిలిచి గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి తెస్తున్నారని ఆమె తెలిపారు. మహిళా నటీమణుల సమయానికి, వారి అభిప్రాయాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు.అంతేకాదు.. ఒక సన్నివేశం గురించి హీరోయిన్ సందేహం వ్యక్తం చేసినా లేదా ఏదైనా సూచన చేసినా.. "ఓవర్ అనలైజ్ చేయొద్దు.. చెప్పింది చేయండి" అంటూ వారి మాటలను తేలిగ్గా తీసుకుంటారని కృతి చెప్పారు. కానీ అదే విషయాన్ని హీరో చెబితే.. "సినిమాపై ఎంత డెడికేషన్ ఉంది.. కథలో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారు" అంటూ ప్రశంసలు కురిపిస్తారని ఇండస్ట్రీలోని డబుల్ స్టాండర్డ్స్‌ను ఎండగట్టారు.తాను కూడా ఒకసారి దర్శకుడికి ఓ సీన్ గురించి సూచన చేయగా తన అభిప్రాయాన్ని తిరస్కరించారని.. కానీ అదే విషయాన్ని తర్వాత ఓ హీరో చెప్పగానే అంగీకరించారని ఆమె గుర్తు చేసుకున్నారు.

సినిమా ప్రమోషన్ల విషయంలో కూడా హీరోయిన్లకు పూర్తి స్వేచ్ఛ ఉండదని కృతి తెలిపారు. ఏ ప్రమోషన్‌కు వెళ్లాలి, ఏ ఈవెంట్‌లో పాల్గొనాలి అనే నిర్ణయాలు కూడా ఎక్కువగా హీరోల అభిప్రాయం ప్రకారమే జరుగుతాయని చెప్పారు. ఒక సందర్భంలో తనకు నిర్ణయాధికారం లేకపోతే ప్రమోషన్లకు హాజరుకానని స్పష్టంగా చెప్పానని.. తర్వాత దర్శక నిర్మాతలు ఒప్పించడంతోనే వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు.ప్రస్తుతం హీరోయిన్లు బలమైన పాత్రలను ఎంచుకుంటున్నప్పటికీ.. ఇండస్ట్రీలో ఇంకా సమానత్వం పూర్తిగా రాలేదని కృతి సనన్ అభిప్రాయపడ్డారు.

ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. సినిమా పరిశ్రమలో జెండర్ ఈక్వాలిటీపై మరోసారి చర్చకు తెరలేపాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User