అయ్యగారి పేరు మారింది..‘నాగ అఖిల్’గా కొత్త నామకరణం.. అసలు సెంటిమెంట్ ఇదే..
తెలుగు సినీ ఇండస్ట్రీలో అభిమానులు తమ అభిమాన హీరోలకు ప్రేమతో కొత్త పేర్లు పెట్టడం కొత్త విషయం కాదు. అయితే తాజాగా అక్కినేని అఖిల్‌కు ఓ అభిమాని పెట్టిన కొత్త పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుపతిలో జరిగిన 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్‌ను ఇకపై 'నాగ అఖిల్' అని పిలవాలంటూ భద్రాచలానికి చెందిన అభిమాని నరసింహారావు నామకరణం చేశారు.
ఈ పేరు వెనుక ఓ ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా ఉందని ఆయన వివరించారు. 'నాగ' అనే పదంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున పేర్లు ఉండగా... 'అఖిల్' అనే పేరులోని తొలి అక్షరాల ద్వారా అన్నపూర్ణమ్మ, అమల పేర్ల భావం దాగి ఉందని తెలిపారు. అంటే అక్కినేని కుటుంబానికి చెందిన నలుగురు ముఖ్యమైన వ్యక్తుల ఆశీస్సులు ఈ ఒక్క పేరులోనే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

గతంలో "అయ్యగారే నెంబర్ వన్" డైలాగ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అభిమానులు అఖిల్‌ను ప్రేమగా 'అయ్యగారు' అని పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు అదే అభిమానులు 'నాగ అఖిల్' అనే కొత్త పేరును కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
అంతేకాదు... ఈ కొత్త పేరు అఖిల్ కెరీర్‌కు అదృష్టాన్ని తీసుకొస్తుందని, 'లెనిన్' సినిమా నుంచి వరుస విజయాలు మొదలవుతాయని కూడా ఆ అభిమాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ నామకరణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జూలై 10న విడుదల కానున్న 'లెనిన్' సినిమా ఫలితంతో ఈ కొత్త పేరు నిజంగానే అఖిల్‌కు లక్ తెస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)