'Donga నా కొడుకు' ఫస్ట్ లుక్ రిలీజ్.. హీరోగా మౌళి కొత్త ప్రయత్నం
'#90స్' వెబ్ సిరీస్, 'లిటిల్ హార్ట్స్' సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. 'Donga నా కొడుకు' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
రాబరీ క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సుష్మిత శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, అలీ, రజిత, రఘుబాబు, ప్రియ, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సింజిత్ యర్రమిల్లి సంగీతం అందిస్తుండగా, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ, శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
'లిటిల్ హార్ట్స్' విజయానంతరం హీరోగా మౌళి చేస్తున్న ఈ కొత్త చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. వినూత్న టైటిల్, క్రైమ్ కామెడీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం కానుంది.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)