గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ కుటుంబం నుంచి సినీ రంగంలోకి.. ప్రీతి ముకుందన్ ఇంట్రెస్టింగ్ జర్నీ

Jul 19, 2026 - 14:40
0 4
గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ కుటుంబం నుంచి సినీ రంగంలోకి.. ప్రీతి ముకుందన్ ఇంట్రెస్టింగ్ జర్నీ

'ఓం భీమ్ బుష్', 'కన్నప్ప' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ నటి ప్రీతి ముకుందన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ బ్యూటీ.. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ కుటుంబానికి చెందిన వారసురాలు కావడం విశేషం.

తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి ముకుందన్.. తన తల్లి తరపు కుటుంబ బంధుత్వం ద్వారా శ్రీనివాస రామానుజన్‌కు ముని మనవరాలు అవుతారని ప్రచారం ఉంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాత గిటారిస్ట్ గిటార్ ప్రసన్న కూడా ఆమెకు బంధువు కావడం మరో విశేషం.

అందంతో పాటు చదువులోనూ ప్రతిభ కనబరిచిన ప్రీతి.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ NIT తిరుచిరాపల్లిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందిన ఆమె, మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు.

'ఆసా కూడ' మ్యూజిక్ వీడియోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి, ఆ తర్వాత వరుస సినీ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. తెలుగులో 'ఓం భీమ్ బుష్'తో పరిచయమైన ఆమె, అనంతరం మంచు విష్ణు నటించిన 'కన్నప్ప'లో హీరోయిన్‌గా నటించి మరింత గుర్తింపు సంపాదించారు.

ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాతో కలిసి నటించిన 'బ్లాస్ట్' చిత్రంలో రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో నటించి తనలోని మరో కోణాన్ని చూపించారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో వరుస అవకాశాలతో ప్రీతి ముకుందన్ కెరీర్ విజయవంతంగా కొనసాగుతోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User