ISROలో 92 ఉద్యోగాలు.. GATE స్కోర్‌తో దరఖాస్తులకు ఛాన్స్
ఇంజినీరింగ్ పూర్తిచేసి ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శుభవార్త చెప్పింది. సైంటిస్ట్/ఇంజినీర్ ‘SC’ కేటగిరీలో మొత్తం 92 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 17, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్లో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండీషనింగ్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత బ్రాంచ్‌లో BE/B.Tech పూర్తి చేసి, కనీసం 65 శాతం మార్కులు లేదా 6.84 CGPA సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో చెల్లుబాటు అయ్యే GATE స్కోర్ తప్పనిసరి.
2026 ఆగస్టు 17 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉండగా, ఇతర అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఎంపిక ప్రక్రియలో GATE స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. ఇస్రోలో కెరీర్ నిర్మించాలనుకునే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)