కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి

Jul 30, 2026 - 14:25
0 3
కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం ఉదయం నాటికి నీటిమట్టం 6.25 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో సాయంత్రానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి ప్రస్తుతం 1,01,530 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితిపై అధికారులు నిరంతరం నిఘా ఉంచి, అవసరమైన జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User