ఆయ్.. గోదారోళ్ల దిల్ కుష్.. తొలి పులస రూ.14,500!
అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పులస చేపల సీజన్ ప్రారంభమైంది. గోదావరికి ఎర్రనీరు చేరడంతో ఈ ఏడాది తొలి పులస చేప మార్కెట్‌కు చేరింది. సుమారు కిలోన్నర బరువున్న ఈ చేప యానాం సమీపంలో మత్స్యకారుల వలకు చిక్కింది.
యానాం చేపల మార్కెట్‌లో జరిగిన వేలంలో ఈ తొలి పులసను మత్స్యకార దంపతులు రూ.14 వేలకే కొనుగోలు చేశారు. అనంతరం మరో రూ.500 లాభంతో రూ.14,500కు విక్రయించారు. సీజన్‌లో తొలి పులస కావడంతో కొనుగోలుదారుల మధ్య భారీ పోటీ నెలకొంది.
గోదావరికి వరద నీరు పెరగడంతో రానున్న రోజుల్లో మరిన్ని పులసలు వలకు చిక్కే అవకాశం ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రత్యేక రుచితో పేరుగాంచిన పులస కోసం ఇప్పటికే మాంసాహార ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)