పెంపుడు కుక్క కోసం పోలీస్ స్టేషన్‌కు యజమాని.. ఆచూకీ చెబితే రూ.10 వేల రివార్డ్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ పెంపుడు కుక్క కనిపించకుండా పోవడంతో యజమాని పోలీసులను ఆశ్రయించిన ఘటన ఆసక్తికరంగా మారింది. గడ్డం నాగరాజు అనే వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క ఈ నెల 18 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి వెతికినా ఆచూకీ లభించలేదు.
అనంతరం కాలనీలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, చర్చి రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కుక్కను తీసుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో నాగరాజు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా, తన పెంపుడు కుక్క ఆచూకీ చెప్పి సురక్షితంగా అప్పగించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఈ విషయాన్ని తన వాట్సాప్ స్టేటస్‌లో కూడా పోస్టు చేశారు.
సాధారణంగా వస్తువులు, వాహనాలు లేదా వ్యక్తుల గల్లంతు కేసులు నమోదయ్యే పోలీస్ స్టేషన్‌లో, పెంపుడు కుక్క కోసం ఫిర్యాదు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)