జట్టు కోసం వందశాతం కష్టపడతా: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

Jul 22, 2026 - 14:44
0 4
జట్టు కోసం వందశాతం కష్టపడతా: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ

వరుస బ్యాటింగ్ వైఫల్యాలపై టీమిండియా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయని, అవన్నీ క్రికెట్‌లో సహజమేనని పేర్కొన్నాడు.

ఇటీవల అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వైభవ్, వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతనిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించాడు.

"నేను నా ఆటను మరింత మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టాను. జట్టు విజయం కోసం ఎప్పుడూ వందకు వంద శాతం శ్రమిస్తాను. కోచ్‌లు, సహాయక సిబ్బంది నుంచి మంచి సహకారం లభిస్తోంది. ప్రాక్టీస్‌కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు" అని వైభవ్ తెలిపాడు.

రేపటి నుంచి జింబాబ్వేతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ నేపథ్యంలో హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం తనకు ప్రత్యేకమని చెప్పాడు. "నాలుగు నెలల క్రితం ఇదే వేదికపై అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో విజేతగా నిలిచాం. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరపున ఇదే మైదానంలో ఆడటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పిచ్‌లపై నాకు మంచి అవగాహన ఉంది. జట్టు విజయానికి నా వంతు కృషి చేస్తాను" అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User