జపాన్ ఓపెన్‌లో గాయం వరంగా..సెమీస్‌లోకి పీవీ సింధు

Jul 17, 2026 - 13:54
0 2
జపాన్ ఓపెన్‌లో గాయం వరంగా..సెమీస్‌లోకి పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. టోక్యోలో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహారా గాయం కారణంగా వైదొలగడంతో.. ఎలాంటి పోటీ లేకుండానే సింధు చివరి నాలుగులోకి ప్రవేశించింది.

ఈ సీజన్‌లో సింధుకు ఇది మూడో సెమీఫైనల్ కావడం విశేషం. ఇప్పటికే మలేషియా సూపర్-1000, ఆస్ట్రేలియా సూపర్-500 టోర్నీల్లో కూడా ఆమె సెమీస్‌కు చేరుకుంది. అలాగే 2023 డెన్మార్క్ ఓపెన్ తర్వాత తొలిసారి సూపర్-750 స్థాయి టోర్నీలో సెమీఫైనల్ ఆడనుంది.

సెమీస్‌లో సింధు.. చైనా స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ యూఫీతో తలపడనుంది. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు జరగగా.. చెన్ యూఫీ 8-6 ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా గత ఐదు వరుస మ్యాచ్‌ల్లో సింధు ఓడిపోయింది. ఈసారి విజయం సాధిస్తే.. ఆ పరాజయాల పరంపరకు తెరపడటమే కాకుండా.. దాదాపు మూడేళ్ల తర్వాత సూపర్-750 టోర్నీ ఫైనల్‌కు చేరిన ఘనతను కూడా సొంతం చేసుకుంటుంది.

ఇక ప్రీక్వార్టర్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ హాన్ యీపై 21-16, 21-14 తేడాతో కేవలం 35 నిమిషాల్లోనే గెలిచిన సింధు.. ఇప్పుడు టైటిల్ వేటలో మరో కీలక అడుగు దూరంలో నిలిచింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User