రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. నిమ్స్ అరుదైన ఘనత

Aug 03, 2026 - 18:17
0 1
రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. నిమ్స్ అరుదైన ఘనత

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి కేవలం రెండున్నరేళ్లలోనే 1000 రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ వైద్యరంగంలో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి వైద్య బృందాన్ని అభినందిస్తూ, అత్యాధునిక వైద్యసేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఇది కీలక ఘట్టమని పేర్కొన్నారు.

నిమ్స్‌లో జరిగిన రొబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా నిర్వహించడం విశేషం. యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆంకాలజీ వంటి విభాగాల్లో అత్యాధునిక సాంకేతికతతో క్లిష్ట శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ విజయాన్ని కొనసాగిస్తూ గాంధీ, ఉస్మానియా, కొత్త టిమ్స్ ఆస్పత్రుల్లో కూడా రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User